తాళ్లపెళ్లిలో మానవత్వం చాటుకున్న శ్రీరామ్ సేన యూత్

ఇల్లంతకుంట మండలం తాళ్లపెళ్లి గ్రామానికి చెందిన బంగారి రాజు అకాల మరణంతో ఆయన కుటుంబాన్ని శ్రీరామ్ సేన యూత్ సభ్యులు శుక్రవారం పరామర్శించారు. మృతుడి తల్లిదండ్రులకు 25 కిలోల బియ్యం, 5 లీటర్ల వంట నూనె, రూ. 2 వేల నగదును అందజేసి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. కష్ట సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన శ్రీరామ్ సేన యూత్‌ను గ్రామస్థులు అభినందించారు.

సంబంధిత పోస్ట్

✕
✕