బోయిన్ పేటలో ఇంట్లో నాగుపాము కలకలం

పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని బోయిన్ పేటలో మంగళవారం అర్ధరాత్రి భూమయ్య ఇంట్లో నాగుపాము కనిపించడంతో కలకలం రేగింది. వెంటనే పాములు పట్టే సత్తికి సమాచారం అందడంతో, అతను అక్కడికి చేరుకుని చాకచక్యంగా పామును పట్టుకుని సీసాలలో బంధించాడు. బుధవారం ఉదయం దానిని అడవిలో వదిలేస్తానని అంబేద్కర్ నగర్ ప్రాంతానికి చెందిన సత్తి తెలిపారు.

సంబంధిత పోస్ట్