చిల్లపల్లిలో గ్రామాభివృద్ధిపై గ్రామసభ

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంథని మండలంలోని చిల్లపల్లి గ్రామ పంచాయతీలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ గోపు సంతోష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో జాతీయ పంచాయతీ అవార్డు ప్రైజ్ మనీతో చేపట్టే అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాలు, ఓటరు జాబితా సవరణ, ఎల్‌నినో, వర్షాకాల చర్యలు, సీజనల్ వ్యాధుల నివారణ, సాగునీరు, విద్యుత్, తాగునీటి సరఫరా, NFBS పథకం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్-2026 ప్రకారం ఇంటి వద్దనే చెత్తను వేరు చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో వేయరాదని సూచించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, హరితహారం, పరిశుభ్రత, వర్షపు నీటి సంరక్షణ, గ్రామ సౌందర్యీకరణ వంటి అభివృద్ధి పనులపై ప్రజల సూచనలు స్వీకరించారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, అన్ని శాఖల అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్