పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శాంతినగర్ లో గల శ్రీ షిరిడీ సాయి బాబా ఆలయంలో గురువారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో భక్తుల సందడి నెలకొంది.