కమాన్ పూర్: మహిళల భద్రత కోసమే షీ టీమ్

మహిళల భద్రత కోసమే షీ టీమ్ లు పని చేస్తున్నాయని షీటీమ్ ఇన్చార్జి మౌనిక అన్నారు. బుధవారం కమాన్ పూర్ మండలం జూలపల్లిలో మహిళలకు షీ టీం అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల భద్రత, ఆన్ లైన్ మోసాలపై, యాంటీ డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. మహిళల రక్షణ కోసం బస్టాండ్, ప్రధాన చౌరస్తాలో రద్దీ ప్రాంతాల్లో కాలేజీల వద్ద షీ టీం నిరంతరంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం శైలజ శాంతి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్