నరేందర్ రెడ్డి కుమారుడిని అభినందించిన శ్రీ జగన్నాథ రథయాత్ర ఉత్సవ కమిటీ సభ్యులు

భారతదేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన "అల్ఫోర్స్" నరేందర్ రెడ్డి గారి కుమారుడిని అభినందించిన శ్రీ జగన్నాథ రథయాత్ర ఉత్సవ కమిటీ సభ్యులు

చక్కటి విద్యను అభ్యసించడం ద్వారా పుష్కలమైన అవకాశాలు ఉంటాయని మరియు సమాజంలో తగిన గుర్తింపు వస్తుందని శ్రీ జగన్నాథ రథయాత్ర ఉత్సవ కమిటీ సభ్యులు అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి గారి నివాసంలో వారి కుమారుడు భారతదేశంలోని ప్రతిసాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సాధించడం పట్ల అభినందిస్తూ మాట్లాడారు.
     ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ఏకాగ్రత మరియు శ్రద్ధ తో విజయాలను సొంతం చేసుకోవచ్చని మరియు ఇతరులకు ఆదర్శంగా ఉండవచ్చని వారు అభిప్రాయపడ్డారు. విద్యార్థులు క్రమం తప్పకుండా విషయాలను నేర్చుకోవాలని మరియు వాటి మీద పట్టు సాధించాలని తద్వారా ఎన్నో అవకాశాలు వస్తాయని ప్రధానంగా ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో విద్యనభ్యసించడానికి అవకాశాలు వస్తాయని మరియు ఉజ్వలమైన భవిష్యత్తుకు పునాది వేసుకోవచ్చు అని వారు చెప్పారు.
    విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రాథమిక దశ నుండే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించిన ద్వారా లక్ష్యాలను సులభంగా సాధించగలుగుతున్నారని వారు అభిప్రాయపడ్డారు. అల్ఫోర్స్ జూనియర్ కళాశాలకు చెందినటువంటి వారి కుమారుడైన వి. శ్రేయస్ రెడ్డి, జాతీయస్థాయి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలను నమోదు చేసి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీట్లను సాధించడం చాలా గొప్ప విషయమని తెలుపుతూ 
 ఐఐఐటి బెంగళూరు - కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
 ఐఐటి బాంబే - కెమికల్ ఇంజనీరింగ్
    జాతీయ స్థాయిలో నిర్వహించిన అన్ని పరీక్షల ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన అతడు భవిష్యత్తులోనూ అదే విజయం పరంపరను బిట్స్ పిలానీలో సైతం కొనసాగించి అగ్రగామిగా ఉండాలని ఆకాంక్షించారు
        ఈ కార్యక్రమంలో శ్రీ జగన్నాథ రథయాత్ర ఉత్సవ కమిటీ సభ్యులు నరహరి గారు, డాక్టర్ కెప్టెన్ మధుసూదన్ రెడ్డి గారు, కన్న కృష్ణ గారు,  డాక్టర్ ఎల్. రాజభాస్కర్ రెడ్డి గారు, తుమ్మల రమేష్ రెడ్డి గారు, కొమరవెల్లి వెంకటేశం గారు.
      పిల్లలు ఉద్యోగ భవిష్యత్తుపై అహర్నిశలు కృషి చేస్తు చక్కటి ప్రోత్సాహం అందిస్తున్న తల్లిదండ్రులైన నరేందర్ రెడ్డి గారిని మరియు వనజా నరేందర్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందించి సత్కరించారు. భవిష్యత్తులోనూ వారి పిల్లలు అద్భుతమైన విజయాలు సాధించాలని ఆకాంక్షించారు

సంబంధిత పోస్ట్