పెద్దపల్లి: ఏఐఎస్ఎఫ్ నాయకులపై దాడులు శోచనీయం

పాలస్తీనాపై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న మారణకాండను ఆపాలని డిమాండ్ చేస్తూ నవ చేతన విజ్ఞాన కేంద్రం రోడ్డు వద్ద నిరసన తెలిపిన ఏఐఎస్ఎఫ్ నాయకులపై బీజేవైఎం దాడి అప్రజాస్వామికమని ఏఐఎస్ఎఫ్ నాయకులు మండిపడ్డారు. సోమవారం పెద్దపల్లి అమర్ నగర్ చౌరస్తా వద్ద ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కును హరించిన దుండగులను అరెస్ట్ చేయాలని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆజాద్ డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్