పెద్దపల్లి: 'విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఆగస్టు 5న ధర్నా'

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 5న పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించబోయే ధర్నాను విజయవంతం చేయాలని యూఎస్ పిసి నాయకులు కోరారు. బుధవారం పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికై దశరవారి పోరాట కార్యక్రమాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. జిల్లాలోని ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని కోరారు. టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కుమార స్వామి, లక్ష్మణ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్