పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని వీధుల్లో కుక్కల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో చిన్నారులు బయటికి వెళ్లాలంటే భయపడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని పట్టణ ప్రజలు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.