పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట కార్మిక సంఘాల జేఏసీ ధర్నా

పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, 8 గంటల పనిని 10 గంటలు చేస్తూ విడుదల చేసిన జీవో నెంబర్ 282ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు బుధవారం ధర్నా చేశారు. మోడీ సర్కార్ నాలుగు లేబర్ కోడ్లను తేవడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మె విజయవంతమైందన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ వేణుకు వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్