పెద్దపల్లి పట్టణంలోని తెనుగువాడ వద్ద గల శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఆదివారం బోనాల మహోత్సవం సందర్భంగా అమ్మవారి ఆలయంలో పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు, పెద్దపల్లి రైతాంగం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, ముదిరాజ్ సంఘం సభ్యులు, ముదిరాజ్ కులస్తులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.