పెద్దపల్లి లేబర్ ఆఫీసర్ ను బదిలీ చేయాలని ఫిర్యాదు

పెద్దపల్లి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ హేమలతను తక్షణమే బదిలీ చేయాలని బుధవారం కార్మిక సంఘాల నాయకులతో కలిసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు బొంకూరి కైలాసం తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని వివిధ మండలాల పరిధిలో భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని, వారికి లేబర్ కార్డులు ఇవ్వడంలో అధికారి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. లేబర్ కార్డులు ఇవ్వకపోవడంతో కార్మికులకు అన్యాయం జరుగుతోందని, బెనిఫిట్స్ అందడం లేదన్నారు.

సంబంధిత పోస్ట్