పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన వేల్పుల రాజేష్ కుమారుడు వేల్పుల రఘురాం (17) మంగళవారం బైక్ అదుపుతప్పి కిందపడిపోవడంతో మృతి చెందాడు. సుల్తానాబాద్ నుంచి రఘురాం పోత్కపల్లివైపు వస్తుండగా కనుకుల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. యువకుడి హఠాన్మరణంతో మడక గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు తీవ్ర శోకంలో మునిగిపోయారు.