స్కూల్ బస్ లను తప్పనిసరిగా కండిషన్ లో ఉంచాలని పోత్కపల్లి ఎస్ఐ దీకొండ రమేష్ తెలిపారు. ఓదెల మండలం పోత్కపల్లిలో గురువారం ఎస్ఐ రమేష్ స్కూల్ బస్ లను తనిఖీ చేసి డ్రైవర్స్ కు అవగాహన కల్పించారు. పిల్లలను తీసుకెళ్లే వెహికిల్స్ తప్పనిసరిగా కండిషన్ లో ఉంచుకోవాలని, ఫిట్ నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్ అన్ని తప్పనిసరిగా ఉండాలని సూచించారు.