ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చిన రెండు కేజీ వీల్ ట్రాక్టర్లకు జరిమానా విధించినట్లు పొత్కపల్లి ఎస్సై ఎస్ఐ దీకొండ రమేశ్ తెలిపారు. గురువారం ఓదెల మండలం మడక, కనగర్తి గ్రామాలలో రోడ్లపై తిరుగుతున్న రెండు కేజీ వీల్స్ ట్రాక్టర్లను పట్టుకుని, తహశీల్దార్ కి జరిమానా కోసం పంపించినట్లు తెలిపారు. ఓదెల మండలంలో కేజీ వీల్స్ తో రోడ్లపై తిరిగే ట్రాక్టర్ల పై కఠినంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.