పెద్దపల్లి: కార్మికుల మధ్య రూ.100 కోసం వివాదం.. ఒకరి హత్య

రూ.100 కోసం జరిగిన గొడవ ఒకరి ప్రాణం తీసింది. పెద్దపల్లి(D) రామగుండం ఎన్టీపీసీ పరిధిలో కూలీలు భవన నిర్మాణ పనులు చేస్తున్నారు. అయితే తోటి కార్మికుల్లో ఓ వ్యక్తికి మరో వ్యక్తి నగదు రూ.300 ఇవ్వగా. రూ.200 తిరిగిచ్చాడు. మరో వంద ఇవ్వలేదని ఘర్షణ పడుతుండగా వినోద్ బుద్దాజీ సొంకార్(44) నచ్చజెప్పారు. దీంతో కోపం పెంచుకున్న మనోజ్ దివాకర్ ఇనుప రాడ్డుతో వినోద్ బుద్దాజీపై దాడి చేశాడు. గమనించిన కార్మికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్