సిరిసిల్ల: ప్రేమ పెళ్లి పేరుతో యువతికి వేధింపులు

సిరిసిల్లలో ప్రేమ, పెళ్లి పేరుతో యువతిని వేధించిన సింగారపు గణేష్ అనే వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. రుద్రంగికి చెందిన గణేష్, యువతిని పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుంటానని వేధించాడు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, ప్రేమ, పెళ్లి పేరుతో వెంటపడినా, ఫోటోలు మార్ఫింగ్ చేసి బెదిరించినా కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని డీఎస్పీ నాగేంద్రచారి హెచ్చరించారు. బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్