మలేషియాలో సిరిసిల్ల జిల్లా వాసి మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన పొన్నాల వెంకట్ రెడ్డి, జీవనోపాధి కోసం మలేషియా వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున ఆయన అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ కొండ రమేష్ గౌడ్, మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. మలేషియా నుండి మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మృతునికి భార్య వనజ, ఒక కుమార్తె ఉన్నారు.

సంబంధిత పోస్ట్