రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ కార్యాలయంలోని టాస్క్ (TASK) రీజనల్ సెంటర్లో ఉచిత సాంకేతిక, బ్యాంకింగ్ కోర్సుల శిక్షణ కోసం కొత్త బ్యాచ్లు ప్రారంభమవుతున్నాయి. డిగ్రీ, బి. టెక్, డిప్లొమా లేదా ఏదైనా గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ శిక్షణకు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 25వ తేదీలోపు తమ వివరాలను సిరిసిల్ల టాస్క్ రీజనల్ సెంటర్లో నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉచితంగా సర్టిఫికెట్లు అందించడమే కాకుండా 100% ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇతర వివరాల కోసం 9573420718, 7075522671 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు.