కవిత కొత్త పార్టీ (TRS)ని ప్రకటించడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది. తాజాగా కవిత పార్టీపై BRS నేత KTR స్పందించారు. రాష్ట్రంలో ఎన్నో పార్టీలు వస్తుంటాయని, పోతుంటాయని, వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. రాజకీయాల్లో ఆవేశం కంటే ఆలోచన ముఖ్యం అని, భవిష్యత్ కార్యాచరణపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తామని KTR పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఆయుధంగా మలుచుకుంటామని కేటీఆర్ అన్నారు.