సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 26 వార్డు సంజీవయ్య నగర్ ప్రభుత్వ పాఠశాల దగ్గర మున్సిపాలిటీ స్థలంలో పిల్లలు ఆడుకోవడానికి జారుడు బల్లలు, ఇతర పిల్లల వస్తువులు, ఓపెన్ జిమ్, చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. మా కాలనీ అభివృద్ధి కి ఆమడ దూరంలో ఉన్నది. ఇప్పటివరకు ఇంటి నెంబర్ సూచిక బోర్డు ఏర్పాటు చేయలేదు. పురపాలక సంఘం కమిషనర్ స్పందించి ప్రత్యేక చొరవ తీసుకోవాలని స్థానికులు శనివారం తెలియజేశారు.