ముస్తాబాద్ మండలానికి చెందిన ప్రఖ్యాత కోచ్, మెంటార్, ట్రైనర్ డా. రవి సిద్ధుల ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతూ.. ఆదివారం ఒకేసారి రెండు అంతర్జాతీయ వరల్డ్ రికార్డులు సాధించారు. సాధించిన వరల్డ్ రికార్డ్స్: Indian Book of Records – 2025, International Book of World Records – 2025. ఈ రికార్డులు ఆయన ఆర్థిక విద్యా ప్రచారం, డిజిటల్ వ్యాపార శిక్షణ, యువతకు ఉపాధి దారుల కల్పనలో చేసిన కృషికి గుర్తింపుగా లభించాయి.