రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు మూడు సీసీ కెమెరాలు, మూడు విద్యుత్ ఫ్యూజులు అపహరించారు. చోరీ విలువ సుమారు రూ.40,000 ఉంటుందని ఇన్‌ఛార్జి హెచ్‌ఎం చిటికెన వేణు తెలిపారు. ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ క్రాంతి కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.