మండలంలోని చెరువుల్లో మట్టిని రెవెన్యూ, పంచాయతీ సెక్రెటరీ అనుమతితో తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇందిరమ్మ లబ్ధిదారులకు సూచించారు. శనివారం తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుక, ఇటుక కొరత ఏర్పడిందని తన దృష్టికి వచ్చిందని, ఇందిరమ్మ కమిటీ సభ్యులు త్వరితగతిన నిర్మాణాలు చేపట్టాలని, అవగాహన కల్పించేలా కృషి చేయాలన్నారు. ఎంపీడీవోలకు కలెక్టర్ సూచనలు చేశారు.