భీమన్న గుడిలో ఇది తాజా పరిస్థితి

వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. దర్శనం చేసుకున్న భక్తులతో ఈవో రమాదేవి దర్శనం ఎలా జరిగింది అంటూ అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి సేవలో తరించారు. గంటల తరబడి క్యూలైన్స్ లో భక్తులు వేచి చూస్తున్నారు.

సంబంధిత పోస్ట్