గోగుల గుట్ట పరిధిలో నంది రూపంలో ప్రతిమలు.. శివుని ఆనవాలు

బోయినపల్లి మండలంలోని మల్కాపూర్ గ్రామంలో గోగుల గుట్ట పరిధిలో నంది రూపంలో ఉన్న విగ్రహ ప్రతిమలు ప్రత్యక్షమయ్యాయి. ఉపాధి హామీ పనిలో భాగంగా ఆ ప్రాంతంలో పనిచేస్తున్న గ్రామస్తులకు ఈ విగ్రహాలు, శివుని ఆనవాలు కనిపించాయి. దీంతో గ్రామస్తులంతా ఆనందోత్సర్యాలతో భక్తి పరవశంలో మునిగిపోయారు. ఆ ప్రదేశంలో ఆలయ నిర్మాణం చేసి పూజలు నిర్వహించాలని ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు.

సంబంధిత పోస్ట్