కేంద్ర బడ్జెట్ 2023-24పై ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా, కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్ పూర్తికి ఈసారి భారీగా నిధులు కేటాయిస్తారా అన్నది ఉత్కంఠగా మారింది. కరీంనగర్ లో ఐఐఐటీ ఏర్పాటు, ధూళికట్ట బౌద్ధస్థూపం, బసంత్‌నగర్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి కూడా నిధులు కేటాయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది బడ్జెట్‌లో జిల్లా ప్రాజెక్టులకు రూ.435 కోట్లు కేటాయించగా, ఈసారి కేంద్రం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చూడాలి.