ఇందిరమ్మ ఇళ్లు మంజూరై గడప పెట్టుకుంటున్న శుభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చిత్రపటంతో కలసి లబ్ధిదారులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన నాయిని నరహరి, లావణ్య దంపతులు గత కొన్ని సంవత్సరాలుగా ఇల్లు లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఇందిరమ్మ రాజ్యంలో తమకు ఇల్లు మంజూరైనట్లు చెప్పారు.