గత కొంతకాలంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండల బీఆర్ఎస్ పార్టీ మహిళ అధ్యక్షురాలుగా కొనసాగుతున్న నాగారం కొమరవ్వ బీఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వానికి గురువారం రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన రాజీనామా పత్రాన్ని జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యకు పంపించనున్నట్లు సమాచారం అందుతోంది. 50 మంది మహిళలతో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.