రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణ, మూలవాగు రెండవ వంతెన నిర్మాణాల్లో భాగంగా జరుగుతున్న కూల్చివేతలు స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని, ప్రభుత్వ తీరులో కక్ష సాధింపు స్పష్టంగా కనిపిస్తోందని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.