ప్రజా ఆరోగ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా, పేదలకు ఆసరాగా సీఎం సహాయ నిధి ఉంటుందని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ఎగ్లాస్పూర్ గ్రామానికి చెందిన మాజీ బారాస పార్టీ సర్పంచ్ భర్త దండు ఐలయ్యకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ ఫాషతో కలిసి 1లక్ష 75 రూపాయల సీఎం సహాయ నిధి చెక్కును ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు.