రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమం నేపథ్యంలో వేములవాడ రాజన్న ఆలయ ఈవో రాధా బాయి ఆలయానికి సంబంధించిన భూమిలో ఆదివారం మొక్కలు నాటారు. ఈవో రాధా బాయి మాట్లాడుతూ దేవస్థానంకు సంబంధించిన గురవయ్యనగర్ సమీపంలో గల భూమిలో వివిధ రకాల మొక్కలను ఆలయ సిబ్బందితో కలిసి నాటినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అన్నారు.