ఘోర ప్రమాదం.. లారీ బైక్ ఢీకొని వ్యక్తి మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి శివారులో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ సిరిసిల్ల ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన లారీ బైకును ఢీకొట్టడంతో, బైక్ పై ప్రయాణిస్తున్న విలాసాగర్ గ్రామానికి చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.

సంబంధిత పోస్ట్