వేములవాడ అర్బన్ లో బీఆర్ఎస్ కార్యకర్తల ముఖ్య సమావేశం

రానున్న పంచాయితీ గెలుపే లక్ష్యంగా పనిచేసి, వేములవాడ అర్బన్ మండలంలో గులాబీ జెండా ఎగురవేయాలని మాజీ జడ్పిటిసి మేకల రవి అన్నారు. శనివారం అనుపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పని చేసి రానున్న సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకోసం పని చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్