ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. విలక్షణమైన పాత్రల్లో తన నటనతో 750 కి పైగా సినిమాల్లో నటించి ఎంతో మంది ప్రేక్షలకులను మెప్పించారని గుర్తు చేసుకున్నారు. కోట శ్రీనివాసరావు మృతి సినీ లోకానికి తీరని లోటని తెలిపారు. వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారని అన్నారు.