వేములవాడ పట్టణంలో మంగళవారం ఉదయం ఓ పిచ్చి కుక్క స్వైరవిహారం చేసి, సుమారు 25 మందికి పైగా ప్రజలను గాయపరిచింది. గాయపడిన వారిలో రాజన్న భక్తులు కూడా ఉన్నారు. బాధితులు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్ ఇప్పపూల మమత- అజయ్ లు ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కుక్కల బెడదను అరికట్టేందుకు 15 రోజుల క్రితమే 40 కుక్కలను ఏ.బి.సి కేంద్రానికి తరలించామని, అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఆందోళన చెందవద్దని చైర్మన్ రాజు తెలిపారు.