వేములవాడ రాజన్నను తెలంగాణ హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ సిహెచ్ పంచాక్షరి శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం అర్చకులు స్వస్తి వచనాలతో ఆహ్వానించి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రాజన్నకు కోడె ముక్కులు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. నాగిరెడ్డి మండపంలో వేద పండితులు వారి కుటుంబానికి ఆశీర్వచనంతో పాటు లడ్డు ప్రసాదం అందించారు.