ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. గురువారం కలెక్టర్ ముస్తాబాద్ మండల నామాపూర్ గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులు, టాయిలెట్స్, స్టోర్ రూమ్ లను స్వయంగా తిరిగి పరిశీలించారు. విద్యార్థులచే హిందీ ఇంగ్లీష్ పాఠాలను చదివించి పలు ప్రశ్నలు అడిగి సమాదానాలు రాబాట్టారు.