ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్యుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని బీజేపీ సీనియర్ నేత ప్రతాప రామకృష్ణ అన్నారు. వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ ప్రాంతంలో సోమవారం కూల్చివేతలు కొనసాగుతున్న తరుణంలో మీడియాతో మాట్లాడుతూ అక్కడ చూసుకుంటే హైదరాబాద్ కూల్చివేతలు, వేములవాడలో కనీస సమయం ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారని పేర్కొన్నారు. రెండో బ్రిడ్జ్ పూర్తి చేయాలని కోరారు. అధికార పార్టీ నేతలు సమాధానం చెప్పాలన్నారు.