రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలోని ప్రధాన రహదారిపై గురువారం ఓ లారీ డ్రైవర్ ఓవర్ స్పీడు వేగంతో వెళ్లడంతో అదుపుతప్పి చెట్టును ఢీకొని బోల్తా పడిన ఘటన కలకలం సృష్టిస్తుంది. అయితే ఈ లారీ సిద్దిపేట నుంచి సిరిసిల్ల వైపు వెళ్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు వివరించారు. ఆదృష్టవశాత్తు ప్రమాద సమయంలో రహదారిపై ఇతర వాహనాలు, ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.