రోడ్డు ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ ఆస్పత్రికి తరలింపు. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని మరో ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలైనట్లు తెలుస్తోంది. స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.