సిరిసిల్ల: వంతెన నిర్మాణం కోసం ఇళ్ల కూల్చివేతలు.. ఉద్రిక్తత

సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధి తిప్పాపురంలో ఉద్రిక్తత నెలకొంది. వేములవాడ పట్టణంలోని మూలవాగుపై నిర్మిస్తున్న రెండో వంతెన ఇరువైపుల భూసేకరణ నిమిత్తం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. తక్షణమే ఖాళీ చేయాలని తిప్పాపురం బస్టాండ్ ఎదురుగా ఉన్న ఇళ్లను అధికారులు కూల్చివేశారు. దాదాపు 30 మంది భూనిర్వాసితులకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే తమ ఇళ్లు కూల్చివేస్తున్నారని బాధితులు ఆందోళన చేశారు.

సంబంధిత పోస్ట్