వేములవాడ: ఆటో స్కూటీ ఢీ.. పలువురికి తీవ్ర గాయాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మంగళవారం రెండో బైపాస్, చాకలి ఘాట్ల వద్ద బైక్, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. స్థానికులు వెంటనే స్పందించి, అతన్ని ఆసుపత్రికి తరలించారు. కొద్ది రోజుల క్రితం ఇదే ప్రాంతంలో బైక్ అదుపుతప్పి కాలువలో పడి ఒక యువకుడు మరణించిన సంఘటన కూడా జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్