కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు పుండ్ర రాజీరెడ్డి, 30 మంది బీజేపీ నాయకులు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వేములవాడ ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారి రాకను స్వాగతిస్తున్నామని, రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇందిరమ్మ పాలన చూసి, బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు.