వేములవాడ: విద్యార్థులతో పాఠాలు చదివించిన కలెక్టర్

తిప్పాపూర్ లోని ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో పాఠాలు చదివించారు. ప్రతి విద్యార్థితో అన్ని పాఠ్యాంశాలు నిత్యం చదివించాలని, రాయించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో పిల్లల హాజరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు అందిస్తున్న కోడిగుడ్లు, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. పిల్లలకు పౌష్టికాహారం అందిస్తూ పాఠాలు బోధించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్