వేములవాడ పట్టణంలోని తిప్పాపురంలో రోడ్ వెడల్పులో భాగాంగా ఇండ్లు, స్థలాలు కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూంలు, నష్టపరిహారం ఇవ్వాలని సీపీఐ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ కడారి రాములు డిమాండ్ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ. నిరుపేద కుటుంబాలకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శంకరయ్య, దుర్గయ్య, మల్లేశం, దేవరాజు, పోషమల్లు పాల్గొన్నారు.