రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని సాయిబాబా ఆలయాలన్నీ గురు పౌర్ణమి సందర్భంగా గురువారం కిక్కిరిసిపోయాయి. స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో భక్తులు నిర్వహించి సేవలో తరించారు. స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో పాటు సీనియర్ బీజేపీ నేత ప్రతాప రామకృష్ణ, టౌన్ సీఐ వీరప్రసాద్, పట్టణ ప్రముఖులు దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు వారిని సన్మానించి సత్కరించారు.