వేములవాడ పట్టణంలో రెండో బ్రిడ్జి నిర్మాణం కోసం భూ సేకరణ పనులు వేగవంతం చేస్తున్నారు. తిప్పాపురం బస్టాండ్ ఎదురుగా ఉన్న ఇళ్లను ఖాళీ చేయాలని గత 15 రోజుల క్రితం అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసుల గడువు ముగియడంతో సుమారు 30 ఇళ్ళ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. తమకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండానే ఇళ్లను కూల్చుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.