చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సోమవారం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ప్రవేశించిన ఎమ్మెల్యేకు దేవస్థానం అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వస్తితో స్వాగతం పలికారు. స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అద్దాల కళ్యాణ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఈవో రాదాబాయి స్వామివారి తీర్థ ప్రసాదాన్ని అందజేశారు.