లబ్ధిదారులకు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సోమవారం చెక్కులు పంపిణీ చేశారు. వేములవాడ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో వేములవాడ రూరల్ మండలం కేంద్రానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లకు ధన్యవాదాలు తెలిపారు.